మహబూబ్ నగర్/నేటి ధాత్రి
రాజకీయాలకు అతీతంగా మహబూబ్ నగర్ అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద రూ.8 కోట్ల 26 లక్షల 70 వేలతో నిర్మించనున్న డైట్ కళాశాల నూతన భవనానికి మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణతో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఉపాధ్యాయులను తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ తయారు చేసిన డైట్ కళాశాల ను అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ తయారు చేయడమే ప్రధానమైన లక్ష్యం అన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో పాటు.. డీకే అరుణ సహాకారం తీసుకుని మహబూబ్ నగర్ ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, కౌన్సిలర్ తిరుమల వెంకటేష్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.