జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల చెన్నూరు రహదారిపై శుక్రవారం రోజున ఇందారం ఎక్స్ రోడ్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ లారీ కారును ఢీకొట్టడం జరిగింది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల వైపు నుండి చెన్నూరు వైపు లారీ మరియు కారు ఒకదాని వెనుక ఒకటి ప్రయాణిస్తున్న సమయంలో ముందు వెళ్తున్న కారును లారీ ఢీకొనడం జరిగింది. ప్రమాదంలో ఎవరికి ప్రాణహానికి లేదని తెలిసింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఎప్పుడు ట్రాఫిక్ తో రద్దీగా ఉండే ఈ రహదారి విశాలంగా ఉండడానికి బదులుగా ఇరుగ్గా ఇబ్బందికరంగా ఉండటం, రోడ్డుకి ఇరువైపులా లైటింగ్ లేకపోవడం వల్లే తరచూ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.