రోడ్డు ప్రమాదం: వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో.. వ్యక్తి మృతి.
అనంతగిరి, నేటి ధాత్రి:
తమ్మరబండ పాలెం గ్రామానికి చెందిన దుద్దిరికి యల్లయ్య వెంకట్ శీను (26) అనే వ్యక్తి తన తల్లి ని కోదాడ ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొచ్చుటకు గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో తన ఫల్సర్ బండి నెం. టీఎస్-29 హెచ్-1858 పై తన ఇంటి సుందరయ్య కాలని తమ్మర బండ పాలెం వద్ద నుండి బయలుదేరి కోదాడ వెళుతుండగా మార్గమధ్యలో తమ్మర శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లేసరికి ఆ సమయంలో ఫంక్షన్ హాల్ నుండి బయటికి వస్తున్న కారు నెం. ఏపీ-39 బిఎస్-4999 గల కార్ డ్రైవర్ తన కారుని అతివేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ దుద్దిరికి యల్లయ్య నడుపుతున్న బండిని ఢీకొట్టగా యల్లయ్య యొక్క తలకి బలమైన రక్త గాయమై అక్కడికక్కడే మృతి. మృతుని భార్య దుద్దిరికి భవాని ఫిర్యాదు మేరకు అనంతగిరి ఎస్సై ఎం. నవీన్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు.
