నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, నార్లపూర్ గ్రామాలలో మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఏవో శ్రీనివాస్, ఏపీఎం రమాదేవి అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొదటి రకం వరి ధాన్యానికి రూ.2203, రెండవ రకానికి రూ. 2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి సి రేణుక, ఏఈఓ కళ్యాణి,వివో చైతన్య వెంకటేశ్వర్ల పల్లి కాక పద్మ, వంగ సుమలత, ఎండి సఫియా బేగం,వివో శివాజీ నార్లాపూర్ బత్తిని రాధిక, బైరగోని మాలతి, నాగపురి సరిత రైతులు,హమాలి తదితరులు పాల్గొన్నారు.