శాయంపేట నేటి ధాత్రి;
శాయంపేట మండల కేంద్రానికి సంబంధించిన సుమారు 210 కుటుంబాల రెడ్డి కుల సంఘం సభ్యులు మాట ఇస్తూ, నేడు భూపాలపల్లి పార్టీ ఆఫీసునందు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ప్రత్యక్షంగా 20 మంది రెడ్డి కుల సంఘం కమిటీ సభ్యులు,నాయకులు ప్రత్యక్షoగా కలిసి రెడ్డి కుల సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ గండ్ర వెంకటరమణ రెడ్డి వెంటే తామంతా ఉంటూ అత్యధిక మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించు కుంటామని మాట ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి రెడ్డి కుల సంఘం కమిటీ సభ్యులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి, శాయంపేట ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్, మండల పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మామిడి అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.