కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్
భూపాలపల్లి నేటిధాత్రి
దేశంలో నేడు బిజెపి ప్రభుత్వం వనేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుందని, దేశ ప్రజల సమైక్యతకు కావలసింది వన్ క్యాస్ట్ వన్ నేషన్ అని, భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలని కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ పిలుపునిచ్చారు.
శనివారం జయశంకర్ భూపాలపల్లి లో స్థానిక కెవిపిఎస్ జిల్లా ఆఫీసులో కెవిపీస్ జిల్లా అధ్యక్షులు ఇసునం. మహేందర్ అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశనికి ముక్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 110 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విభిన్న వైవిధ్యాలు కలిగిన దేశంలో దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైన నిలబెట్టడానికి, కులం మతం భాషా ప్రాంతం అతీతంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. ప్రాచీన మనువాద సంస్కృతి సైదాంతిక భూమిక కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ కనుసనల్లోని బిజెపి ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి అంబేద్కర్ ఆలోచనలను తుద ముట్టించటానికి కుట్రలు కుతంత్రాలు చేస్తుందని సామాజిక శక్తులు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు