ధర్మ సమాజ పార్టీ మండల అధ్యక్షుడిగా పర్లపల్లి కుమార్.

చిట్యాల, నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లో శనివారం రోజు న ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పర్లపల్లి కుమార్ ను నియమించడం జరిగిందిఅని అన్నారు, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపన కోసం ధర్మసమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పడం జరిగింది. పర్లపల్లి కుమార్ మాట్లాడుతూ..నాకు అధ్యక్షుడు గా అవకాశం ఇచ్చిన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారధన్ మహరాజ్ గారికి మరియు జిల్లా కమిటీ కి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేయడానికి,పార్టీ కార్యక్రమలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల మండల ఉపాధ్యక్షుడిగా పుల్ల అశోక్, మండల ప్రధాన కార్యదర్శిగా నేరెళ్ల రమేష్, మండల కోశాధికారి రత్న రమేష్, మండల కార్యదర్శి మెట్టెవాడ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version