`బీసీల రాజ్యాధికారం కోసం రేవంత్ పోరాటం!
`బీసీల రిజర్వేషన్ కోసం కదిలిన తెలంగాణ కాంగ్రెస్ సైన్యం.
`తెలంగాణ దేశంలోనే బిసి గణన చేపట్టిన తొలి రాష్ట్రం.
`సీఎం. రేవంత్ అడుగులు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం.
`ఎప్పటికైనా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం
`రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్సే!
`ఆ రిజర్వేషన్లు పెంచేది కాంగ్రెస్సే
`బడుగు బలహీన వర్గాలకు కొండంత ధైర్యం కాంగ్రెస్సే
`దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడేది కాంగ్రెస్సే
`అభివృద్ధికి అడుగులు వేసినా అది కాంగ్రెస్సే
`సాగు నీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే
`పనికి ఆహర పథకం తెచ్చింది కాంగ్రెస్సే
`ఉపాధి హామీ ఇచ్చింది కాంగ్రెస్సే
`పేదరికాన్ని పారద్రోలింది కాంగ్రెస్సే
`కంప్యూటర్ తెచ్చింది కాంగ్రెస్సే!
`అభివృద్ధి మూలాలన్నీ కాంగ్రెస్సే
`దేశమంతటా కనిపిస్తున్న ఆనవాళ్లన్నీ కాంగ్రెస్సే
-దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్
హైదరాబాద్, నేటిధాత్రి:
నిజంగానే సిఎం. రేవంత్ రెడ్డి బిసి బంధు అని చెప్పాలి. బిసిల అభ్యున్నతి కోసం, రాజకీయంగా బిసిలకు మరింత ప్రాదాన్యత కల్పించడం కోసం సిఎం. రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని అందదూ ప్రశంసించాల్సిందే.
నమ్మకమనేది ఒక ప్రమాణం. ఒక ప్రయాణం. గమ్యం చేరేదాకా వెనుతిరిగి చూడని లక్ష్యం. అది సిఎం. రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిదర్శనం. గత ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చేసిన ధైర్యం. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బిసిలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని శపధం చేశారు.
ఆ ప్రతిజ్ఞ నెరవేర్చడానికి ఆయన పడుతున్న కృషి అంతా ఇంతా కాదు. తన రాజకీయ గమనంలో రేవంత్ రెడ్డి నెరవేర్చిన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అందులో బిసిల రిజర్వేషన్ అంశం కూడా సాధించి, చరిత్రకే పాఠాలు చెప్పే నాయకుడౌతాడని చెప్పడంలో సందేహం లేదు. చరిత్రను తిరగరాస్తాడని అనడంలో శషబిషలు ఏమీ లేవు.
ఎందుకంటే సిఎం. రేవంత్ రెడ్డి పట్టుదల అంటే అంత స్ధిరంగా వుంటుంది. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానిని సాధించకుండా వున్న సంద్భర్బాలు లేవు. రాజకీయంగా ఆయన ఎదిగిన తీరు కూడా అంతే వైవిద్యమైనది. పట్టువదలని విక్రమార్కుడిలాంటి ఆశయ సాధన రేవంత్ రెడ్డి. ప్రజలకు హమీ ఇచ్చాం.
బిసిలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తామన్న భావనతోనే ఆయన వున్నారు. అందుకే ఒక్కొ అడుగు ముందుకేస్తున్నారు. అసాధ్యాతాలను సుసాధ్యం చేయడం రేవంత్ రెడ్డికి పట్టుదలతో పెట్టిన విద్య. అంతే కాదు రేవంత్ రెడ్డి రాజకీయం వ్యూహం అర్దం చేసుకోవడం చాలా కష్టం. గత ఎన్నికల్లో తన రాజకీయ పద్మవ్యూహంలో కేసిఆర్ సైతం చిక్కుకునేలా చేశారు. బిఆర్‌ఎస్ రాజకీయ చరిత్రకు చరమగీతం పాడారు. ఓడిరచి ఇంట్లో కూర్చోబెట్టారు. అదీ రేవంత్ రెడ్డి రాజకీయ చతురత అని అందరూ కొనియాడారు. రేవంత్ రెడ్డికి ఆత్మవిశ్వాసం ఎంతో ఎక్కువ. ప్రతి నాయకుడికి అలాంటి ఆత్మవిశ్వాసంతోపాటు ఆచరణ కూడా వుండాలని నిరూపించని ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. ఒక ఎన్నికలో ఒంటి చేత్తో రాష్ట్ర ప్రజలను నమ్మించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఒక్కడుగా పార్టీని గెలిపించడం అంత సులువు అసలే కాదు. పదేళ్లు ప్రభుత్వానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిపెట్టడమే కాకుండా, అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి ఫధంలో నడిపిస్తున్నారు.
ఎందుకంటే తెలంగాణలో మాట తప్పని, మడమ తిప్పని నాయకుడుగా పేరున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే ఎన్నికల ముందు అనేక కఠోరమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలుతో ప్రజల మన్ననలు మరింత పొందుతున్నారు. ఇప్పుడు 42శాతం బిసి రిజర్వేషన్లను కూడా సాదించి, బిసిలకు బహుమానంగా అందిస్తారని అనుకుంటున్నారు. కేంద్రం మెడలు వంచైనా సరే, 42శాతం రిజర్వేషన్ సాధించి అమలు చేస్తామంటున్నారు. ఇందుకు ఆయన కార్యాచరణ కూడా అమలు చేస్తున్నారు. సాద్యమయ్యే పనులపై హమీలు ఎవరైనా ఇస్తారు. అసాధ్యమనుకున్న వాటిని సాధించినప్పుడే నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు. నిజంగా బిసిలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తే మాత్రం దేశంమంతా రేవంత్ రెడ్డి వైపు చూస్తుంది. ఆయా రాష్ట్రాలలో కూడా రేవంత్ రెడ్డి తరహా ఆదర్శవంతమైన రాజకీయాలకు శ్రీకారం చుడతారు. ఎందుకంటే రాజకీయంగా ఆయన అనేక సమస్యలను సుసాద్యం చేశారు. పాలనతో ససంపన్నం చూపిస్తున్నారు. రైతులకు బోనస్ 500 రూపాయలు అందించడం అనేది ఒక గొప్ప నిర్ణయం.
అంతే కాదు ఏక కాలంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2లక్షల రుణమాఫీ చేయడం అనేది మరింత గొప్ప విషయం. ఇలా రాష్ట్రంలోని ఇతర పార్టీలు సాధ్యం కావని అని చెప్పిన వాటిని సిఎం. రేవంత్ రెడ్డి సుసాధ్యం చేసి చూపించారు. రైతులను రుణవిముక్తి చేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇదీ ఒక నాయకుడి చిత్తశుద్ది అని దేశమంతా తెలుసుకునేలా చేశారు. ఇప్పుడు బిసిలకు 42శాతం రిజర్వేషన్ అమలుపై పోరాటం చేసి, సాధించి, కొత్త తరానికి దశ, దిశను చూపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్రంలో పంచాయితీ రాజ్ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్ అమలు జరిగితే వచ్చే పదేళ్లలో బిసిలు రాజ్యాధికారానికి మరింత దగ్గరయ్యే అవకాశమైనా కల్పించబడుతుంది. వచ్చే తరానికైనా బిసిలు రాజ్యాధికారం చేపట్టేందుకు వీలు కలుగుతుంది.
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విప్లవం కనిపిస్తుంది. సామాజిక తెలంగాణ ఆవిష్కరణ జరుగుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు సంపూర్ణ న్యాయంజరగుతుంది. తెలంగాణ అంటేనే బిసిలు. తెలంగాణ కోసం కొట్లాడిన వర్గాలలో బిసిలదే అగ్రభాగం. అందువల్ల తెలంగాణ రాజకీయాల్లో బిసిలకు అగ్ర తాంబూలం అందడం న్యాయం. అందుకు కాంగ్రెస్ తొలి అడుగు వేస్తామని సిఎం. రేవంత్‌రెడ్డి చెప్పారు. అనుకున్నట్లు అడుగులు వేస్తున్నారు. బిసి రిజర్వేషన్ అంశంపై బిల్లును రూపొందించారు. అసెంబ్లీలో ఏక గ్రీవంగా ఆమోదించారు. దానిని గవర్నర్ ఆమోదరం కోసం పంపించారు. అందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు డిల్లీలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ వద్ద దీక్షను చేపట్టనున్నారు. ధర్నా కార్యక్రమం నిర్వహించి, దేశ వ్యాపర్తంగా బిసిల రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చ ఎత్తుగడ రేవంత్‌రెడ్డి వేశారు. ఇది ప్రతి బిసి తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఏకం కావాలి. 42శాతం రిజర్వేన్ అనేది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హమీ ఇచ్చిన మాట వస్తవమే. కాని ఆ రిజర్వేషన్ సాధనలో అన్ని పార్టీలు కలిసి రావాలి. అందరూకలిసి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చెపట్టాలి. న్యాయపరమైన చిక్కులు తొలగించే ప్రయత్నం జరగాలి. రాజ్యాంగం అమలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు అనేక అంశాలలో మార్పులు చేసుకోవడం జరిగింది. అప్పుడెప్పుడో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఎల్లకాలం సాగాలన్న రూలేం లేదు. అదే సుప్రింకోర్టుకు పాలకులు చిత్తశుద్దితో ప్రజల ఆకాంక్షలను వెలుబుచ్చితే సుప్రింకోర్టు కూడా సానుకూలంగా స్పందిచొచ్చు. ముందుగానే 42 రిజర్వేషన్ అమలు సాధ్యం కాదేమో? అన్న అనుమానాలు ఎందుకు? ప్రయత్నం జరగాలి. సుప్రింకోర్టును ఒప్పించాలి. అందుకు సరైన వాదనలు వినిపించాలి. అందుకు రాజకీయ పార్టీలన్నీ అందుకు సహకరించాలి. సెప్టెంబర్ ఆఖరులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశంతోపాటు, 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు చేయడం పై కాంగ్రెస్ పార్టీ సిరియస్‌గా దృస్టిపెట్టింది. నిజం చెప్పాలంటే ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా దేశ చరిత్రలో లిఖించబడుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి పేరు చిరస్ధాయిగా నిలిచిపోతుంది. మనదేశంలో బిసిల జనాభా మేరకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. కాని డెబ్బై ఏళ్లలో ఏనాడు, ఏ స్దాయిలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. అందుకు సుప్రింకోర్డు ఆదేశాలు కూడా అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నాయి. ఒకవేళ సుప్రింకోర్టు తీర్పు అడ్డులేకపోతే అమలు చేసేవాళ్లమని పదే పదే అనేక పార్టీలు చెప్పుకున్న సందర్బాలున్నాయి. దాట వేసేందుకే ఎక్కువ ఇష్టపడేవి. బిసిల మీద ప్రేమ ఒలబోస్తున్నట్లు నటిస్తూనే బిసిల రిజర్వేషన్ అమలుచేయాలంటే దైర్యం చేయలేకపోయాయి. బిసిలు రాజకీయంగా ఎదిగితే ఓసిల రాజకీయానికి మరణ శాసనమే అని భావించేవారు. అందుకే బిసిలను రాజకీయంగా ఎదగకుండా ఎప్పటికప్పుడు ఏదో సానును చూపిస్తూ వుండేవారు. మొత్తానికి బిసిలను ఎదగకుండా చేశారు. ఇప్పుడ బిసిలకు 42శాతం ఎట్టిపరిస్ధితుల్లోనూ రిజర్వేషన్ అమలు చేయాలని రేవంత్ సర్కార్ గట్టిగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో ముందుకు పోవడం తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదని సిఎం. రేవంత్ రెడ్డి అనేక సార్లు తేల్చి చెప్పారు. బిసిల రిజర్వేషన్ ఎలా అమలు చేయాలన్నదానిపై క్యాబినేట్‌లో సుధీర్ఘమైన చర్చ జరిగింది. అందుకోసం ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ అమలుకు ఒక దారి పడినట్లే అని అంటున్నారు. దేశంలోనే ఇది సంచలనామ్మకమైన ప్రక్రియగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. అది కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ఏంతో మేలు జరుగుతుంది. ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలపేందుకు కూడా మార్గం వేసినట్లౌవుంది. ఒకే దెబ్బకు రెండుపిట్టలన్నట్లు కాంగ్రెస్ పార్టీకి దేశ మంతా నీరాజనం పడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. దేశ మంతా సిఎం. రేవంత్‌రెడ్డిపేరు మారు మ్రోగిపోతుంది. తెలంగాణలో తిరుగులేని, ఎదురులేని శక్తిగా రేవంత్ రెడ్డి నాయకత్వం నిలుస్తుంది.