#ఎట్టకేలకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.
#ఆనందం వ్యక్తం చేస్తు సంబరాలు చేసుకుంటున్న మధ్యాహ్న భోజన కార్మికులు.
#నేటి ధాత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన కార్మికులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి: గత నాలుగు రోజుల క్రితం కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలతో పాటు బిల్లులు రాలేదని ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి భారీ వర్షం లో నిరసన కార్యక్రమం చేపట్టగా నేటి ధాత్రిలో ప్రచురణ రాగా కథనంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు మరియు సంబంధిత బిల్లులను విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితఇంద్రసేనారెడ్డి ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా బోట్ల నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ప్రభుత్వం దృష్టికి కార్మికుల ఆవేదనను తీసుకుపోయి సమస్యలు పరిష్కరించడం హర్షణీయమని అలాగే విద్యాశాఖ మంత్రి ఇంద్రసేనారెడ్డి, పాఠశాల రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణా గార్లకు అలాగే మా నిరసన కార్యక్రమాన్ని ప్రజలకు ప్రభుత్వానికి చేరేలా కృషి చేసిననేటి ధాత్రి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు కార్యక్రమంలో ప్రశాంత్, త్యాగరాజన్, వినయ్, సాగర్, విష్ణు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.