పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి అదికారులు ఉపాది హమీ పనులు మరియు రికార్డు ల పరిశీలన చేయడానికి ముందు పనులు మరియు వాటికి సంబందిచిన రికార్డ్ లు సిద్దంగా ఉంచాలని మండల పరిషత్ అబివృద్ది అదికారి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.మండల పరిదిలోని అందరు పంచాయతీ అదికారులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లతో సమీక్షా సమావేశం నిర్వహించి వచ్చే వారం యం.ఓ.ఆర్.డి టీం వస్తున్నందున అన్ని గ్రామాల్లో ఈజీయస్ ద్వారా చేపట్ట బడిన పనులకు సంబందించిన పని ప్రదేశం వద్ద నేం బోర్డ్ ఉండాలని అలాగే జాబ్ కార్డ్ అప్డేట్ చేయాలని ప్రతి పనికి వర్క్ పైల్ ఉండాలని గ్రామ పంచాయతీ లో 7 రిజిష్టర్ లు అప్డేట్ గా ఉంచాలని సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అలాగే మస్టర్లు బ్లూఫాంస్ సిద్దంగా ఉంచాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఏపీఓ ఇందిర,టెక్నికల్ అస్టెంట్లు సుమలత,నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

