గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
సాయనపల్లి నుండి దామరతోగు మార్గ మధ్య రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతున్న అధికార్లు, నాయకులు ఎవరు స్పందించడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వి.సి దొర ఆరోపించారు.మేడారం జాతర సమయంలో తుతు మంత్రంగా మరమ్మతులు చేసి అసలు ప్రమాద ప్రాంతాన్ని మరిచిపోయారన్నారు.నాయకులు, అధికార్లు రంగాపురం ,గుండాల ప్రధాన రహదారి కనుక బారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఉన్నత అధికారులు సొరవ తీసుకొని రోడ్డు పనులు మొదలు పెట్టాలన్నారు.