నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో తెలంగాణా జెఏసీ ఉద్యమకారుడు, లెక్చరర్ సాంబరాతి మల్లేశం సతీమణి మమత మృతి చెందింది. ఈ సందర్భంగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ ఆయన స్వగృహంలో మల్లేశంను సోమవారం పరామర్శించారు.మృతురాలు మమత చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, జెడ్పిటీసీ కోమాండ్ల జయగోపాల్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, పంజాల రాందాస్ గౌడ్,ముత్యాల నవీన్ గౌడ్,సాం బరాతి శ్రీనివాస్,సాంబరాతి రాజు,సాంబరాతి రవి, సౌడారపు ఈశ్వరయ్య, పుట్టపాక మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.