పరకాల,నేటిధాత్రి :
పరకాల మండలం నాగారం గ్రామంలో ఆముదాలపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అనే గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవషాత్తు కింద పడ్డాడు. దీంతో వెంకటేశ్వర్లుకు ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.కాగా వెంకటేశ్వర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ మోకులు ఇస్తామన్న ప్రభుత్వం వాగ్దానం చేసి పంపిణీ చేయలేదన్నారు. ఎక్స్ గ్రేషియా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణా ప్రభుత్వం 10 లక్షలు చెల్లించాలని చెప్పారు.సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని,జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టేందుకు వెంటనే జీఓ జారీ చేయాలనీ పేర్కొన్నారు.గాయపడిన వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ హన్మకొండ జిల్లా అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల శ్రీ రామ్ గౌడ్, అమదాలపల్లి రాజేష్ గౌడ్, ఆముదాల పల్లి హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.