హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన సలహదారు శ్రీ వేం.నరేంద్ర రెడ్డి నీ ఏబీవీపీ జాతీయ నాయకులు అంబాల కిరణ్ మరియు రాష్ట్ర నాయకులు అమర్ కలిశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో జరిగిన 3 కోట్ల అవినీతి, యూనివర్సిటీ హాస్టల్లో జరిగిన 3.5 కోట్ల అవినీతి, న్యాక్ అభివృద్ధి పేరుతో జరిగిన 2 కోట్ల అవినీతి అక్రమాలను కేయూ పీహెచ్డీ కేటగిరి టు లో జరిగిన అక్రమాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదోన్నతులు జరిగిన అక్రమాలు ఆధారాలతో సహా వివరించి కేయూ విసి పైన శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి కోరారు. క్యాటగిరి వన్ పి హెచ్ డి అడ్మిషన్స్ లో రెగ్యులర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు పార్ట్ టైం అవకాశం కల్పించారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ లో ఇవ్వనప్పటికీ నవీన్ మిట్టల్ కోరినట్లు వారికి అడ్మిషన్ ఇచ్చారని వారు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ బీసీ ఆచార్య తాటికొండ రమేష్ అవినీతి, అక్రమాలపై కమిటీ వేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.