గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కర్కపల్లి గ్రామంలోని కళాకారులు కలలను నమ్ముకుని జీవిస్తూ ప్రజలకు చైతన్య పరుస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు పర్యావరణం పరిరక్షణ హరితహారం మూఢనమ్మకాలు పచ్చదనం పరిశుభ్రత నిరక్షరాస్యత నిర్మూలన కుటుంబ నియంత్రణ మొదలైన ప్రభుత్వ ప్రయోజత కార్యక్రమాలపై గణపురం మండలం కర్కపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన గడ్డం పూర్ణచందర్ కోడలు రజిత శశి అనేక స్టేజీలపై తన కళా ప్రదర్శనలు చిన్ననాటి నుండి డప్పు డోలక్ మృదంగం మొదలైన వాయిద్యాలతో సప్త స్వరాలను వినిపిస్తూ రేడియో దూరదర్శన్ తెలంగాణ భాష సంస్కృతి దేవాదాయ ధర్మాదాయ శాఖల ద్వారా అనేక సంవత్సరాలుగా తన కల ప్రదర్శనాలు జాతి ప్రయోజనాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింధు హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ప్రస్తుతం పని చేస్తున్నారు వీరి కలను గుర్తించి శ్రీ కోదీ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి కవులకు కళాకారులసమ్మేళనంలో శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవార్డుల ప్రధానోత్సవం ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్ రావు సినిమా డైరెక్టర్ దామోదర్ గౌడ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అప్పం కిషన్ కార్యక్రమం నిర్వాహకులు కొలంగోరి సంజీవరావు చేతుల మీదుగా గడ్డం పూర్ణచందర్ గడ్డం రమేష్ చంద్ర గడ్డం రజితకు సన్మానించి అవార్డు ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిందుహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా సంక్షేమ రంగాలలో అత్యంత వెనుకబడిన జాతి అయినప్పటికీ కళా రంగంలో నీటిగా చిందు జాతి ఉంటుంది అందుకే కళాకారులకు అవార్డులు రివార్డులు సన్మానాలు ప్రజల ప్రశంసలు పొందటం అనాదిగా వస్తుందని ఈ మధ్యకాలంలో పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు సమ్మయ్యను సన్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం మా చిందు జాతి ప్రజలను అన్ని విధాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉగాది రోజున అవార్డు అందుకున్న పున్నం చందర్ రమేష్ చంద్రా రజిత అభినందనలు శుభాకాంక్షలు తెలిపినారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గణేష్ శంకర్ రమేష్ వెంకన్న ఆనందం మల్లేష్ శరత్ కనకయ్య ప్రశాంత్ శ్రీకాంత్ రామ్ నీలకంఠ సమ్మయ్య అభినందనలు తెలియజేసినారు.