నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103 వ జయంతి పురస్కరించుకొని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యములో హన్మకొండ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న పీవీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా రాష్ట్ర కార్య నిర్వాహక అద్యక్షుడు మోత్కూరి రాము మాట్లాడుతూ..ఆర్ధిక సంస్కరణల జాతిపిత పీవీ నరసింహారావు అని కొనియాడారు..ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఉదయమర్రి కృష్ణమూర్తి మాట్లాడుతు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడని తెలిపారు…. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు మోత్కూరి రాము,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి దేవులపల్లి వాణి,జిల్లా అధ్యక్షులు ఉదయమర్రి కృష్ణమూర్తి,డింగరి శ్రీకాంత్,జాగర్లపుడి శ్రీనివాస్ యువజన నాయకులు విష్ణుదాస్ వంశీధర్,సాయిరాం,కామేశ్వర రావ్, సురేష్ మరియు పలువురు సభ్యులు పాల్గోన్నారు.