హుజురాబాద్ నియోజకవర్గ జర్నలిస్టులకు ద్రోహం చేసిన పాడి కౌశిక్ రెడ్డి.

జమ్మికుంట :నీటి ధాత్రి
జర్నలిస్టుల పేరుతో తన అనుచరులకు, అనర్హులకు ఇండ్ల స్థలాలను కేటాయించిన కౌశిక్ రెడ్డి.
జమ్మికుంట
జర్నలిస్టు కానీ అనర్హులకు తన అనుచరులకు జర్నలిస్టుల పేరుతో ఇల్లు, ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేటాయించారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికెళ్ల భానుచందర్ అన్నారు. శుక్రవారం రోజున టి డబ్ల్యూ ఎఫ్ జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నియోజవర్గ కమిటీ సమావేశం నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల.యోహాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికెళ్ల భానుచందర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు పునఃప్రారంభం సౌకర్యం వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. స్థానికంగా హుజురాబాద్ నియోజకవర్గం లో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎమ్మెల్యే ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మోసం చేశారని దీనిపైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ విచారణ చేపట్టి అర్హులైన వారికి ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు. సౌడమల్ల యోహాన్, అరికెళ్ల భానుచందర్, ప్రధాన కార్యదర్శి అయిత రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఏబూషి సంపత్, ఖాజా ఖాన్, దొడ్డే రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, కొప్పుల శ్రీరామ్, రవికృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version