నిజాంపేట: నేటి దాత్రి, ఏప్రిల్ 4
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మైనంపల్లి రోహిత్ సహకారంతో నందగోకులo గ్రామంలో నిరుపేద కుటుంబానికి భాగ్యలక్ష్మి శీను దంపతులకు చెందిన కవిత వధువుకు గురువారం ఎంఎస్ఎస్ఓ మండల ఆధ్యక్షుడు గుమ్ముల అజయ్ ఆధ్వర్యంలో పుస్తె మెట్టలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల పెన్నిధి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుండి నిరుపేదలకు పూస్తేమెట్టలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మ్యదరి కుమార్, మ్యదరి అశోక్, మహిపాల్ రెడ్డి, పిట్ల రమేష్, మేదరి కనకరాజు, దుబ్బాక సత్యనారాయణ, ఊడేపు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.