రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండలశాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలని, రైతులకు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ఐదు వందల రు.ల బోనస్ ప్రకటించాలని, రాష్ట్రంలో పసల్ బీమా అమలు చేయాలని, వడ్ల కొనుగోళ్ళను వెంటనే మొదలు పెట్టి తాలు, తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొలపూరి రమేష్, తిర్మలాపూర్ ఎంపీటీసీ సభ్యులు మోడీ రవీందర్, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షులు బక్కశెట్టి శ్రీకాంత్, బూత్ కమిటీ అధ్యక్షులు సింగసాని మల్లేశం, సిరిపురం శంకర్, గోపు అనంతరెడ్డి, పొన్నం అభిషేక్, వేముల శ్రీనివాస్, పాదం సాగర్, అనంతల తిరుపతి, బుర్ర వినయ్, కొల్లూరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.