పుర కౌన్సిల్ సాధారణ సమావేశం

రామకృష్ణాపూర్, జనవరి 25, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయము లో పుర చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన గురువారం పుర కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశములో ఆరు అంశాలతో కూడిన ఎజెండాను పుర మేనేజర్ నాగరాజు కౌన్సిల్ సభ్యులందరికి చదివి వినిపించి వివరించడం జరిగిందని అన్నారు. చైర్ పర్సన్ జంగం కళ సైతం ఒక అంశమును టేబుల్ ఎజెండా గా ప్రవేశపెట్టడము జరిగిందని తెలియజేశారు. ఏడు అంశములను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవముగా ఆమోదింపచేసినట్లు తెలియజేశారు.అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో పని చేసే పారిశుధ్య సిబ్బందికి కొబ్బరి నూనె డబ్బాలు, సబ్బులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పుర కమీషనర్ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ అర్రం విద్యా సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు,కోఆప్షన్ సభ్యులు,పుర రెవెన్యూ అధికారి కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ అచ్యుత్ , టీపీఎస్ రాజ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు వసంత్, ప్రదీప్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version