#సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో నరసింహమూర్తి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని ప్రజలందరూ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నరసింహమూర్తి పేర్కొన్నారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను అమలు చేయడం జరిగిందని ఒకవేళ ఏదైనా కారణం చేత అర్హత ఉండి అట్టి పథకాలను లబ్ధి పొందనట్లయితే ఎలాంటి తప్పులు నైనా సరి చేసుకొనుటకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్, సేవా కేంద్రం ఇంచార్జ్ గంగాధర్, అప్రోజ్ పాల్గొన్నారు.