కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్
సామల రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యార్థులకి ఉన్నతమైన విలువలు కలిగిన గుణాత్మకమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ సామల రమేష్ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య అన్నారు
పరీక్షల సందర్భంగా భూపాలపల్లి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ జంగేడు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం .శ్రీ చైతన్య హై స్కూల్ .మైనార్టీ విద్యాలయాన్ని పరీక్షల నిర్వహణను సామల రమేష్ . శనిగరపు భద్రయ్య కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు భయము విడనాడి రాయాలని. ఉన్నతమైన విలువలు కలిగిన గుణాత్మకమైన విద్యను అందిపుచ్చుకోవాలని ఉపాధ్యాయుల సహాయం సహకారాలు పొందాలని.ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మాన మార్గంలో నడిపించడానికి చక్కని సూచనలు సలహాలు ఇవ్వాలని వారు ఉపాధ్యాయులు కోరారు
నవంబర్ 2న పరీక్ష జవాబు పత్రములను మూల్యాంకనము చేయాలని . నవంబర్ 5న విద్యార్థుల యొక్క మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నవంబర్ 16న విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల టీచర్ల సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల యొక్క మార్కులను పరిశీలించి వారి యొక్క ప్రగతిని గుర్తించి ప్రోగ్రెస్ కార్డ్స్ పంపిణీ చేయాలని ప్రధాని ఉపాధ్యాయులకు వారు సూచించారు ఈ కార్యక్రమంలో జంగేడు ప్రధానోపాధ్యాయులు చిలువేరు అశోక్ . ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.