ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని సన్మానించిన ఐజేయు భూపాలపల్లి జిల్లా కమిటీ.

భూపాలపల్లి నేటిధాత్రి

మంగళవారం హైదరాబాద్ లోని దేశోద్దారక భవన్ లో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటి అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన చేపట్టిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగకు ముఖ్య అథిదిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్ అధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు పుష్ప గుచ్చం అందించి శాలువా తో సత్కరించడం జరిగింది.
అనంతరం టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ హలీ ని సత్కరించారు.
అనంతరం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి శ్రీనివాస్ రెడ్డి కి వివరించి, జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్ట్ హెల్త్ కార్డులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని ,జర్నలిస్టుల పైన దాడులు జరగకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
ఇంటి స్థలాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జర్నలిస్ట్ కు ఉపయోగపడే హెల్త్ కార్డులను తీసుకొస్తామని సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్ రెడ్డి కి జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్ శ్యామ్ ధన్యవాదాలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సామంతుల శ్యామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సామల శ్రీనివాస్ ,టెమ్జ్ జిల్లా అధ్యక్షుడు కొంకుల సాంబయ్య, బత్తుల మల్లేషం మరియు ఇతరులు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version