రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని చూస్తున్న బావ బామ్మర్దులు

-మేడిగడ్డ కుంగుబాటు గత ప్రభుత్వ డోల్లతనానికి నిదర్శనం

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని బావ బామ్మర్దులు కేటీఆర్,హరీష్ రావు చూస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

మంగళవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం,తేట్టకుంట, చీర్లవంచ గ్రామాల్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఉన్న సిలిండర్ ధర 10 సంవత్సరాల తర్వాత 500 కే గ్యాస్ సిలిండర్ అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం అన్నారు.

ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే కేటీఆర్,హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

మొన్నటి రోజున కేటీఆర్,నిన్నటి రోజున హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని మాట్లాడడం చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది అన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని, వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుందని కానీ ఇప్పుడు కేటీఆర్,హరీష్ రావు మాటలు చూస్తుంటే అధికారం కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

మేడిగడ్డలో 7 టీఎంసీల నీటిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందుకే వదిలిపెట్టారని, ఎన్నికల కంటే ముందు మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయిందని రిపోర్టు రాగానే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆగ మేగల మీద తమ లోటుపాట్లు ఎక్కడ బయటపడతాయని భయపడి మేడిగడ్డలోని నీటిని సముద్రంలోకి వదిలేశారన్నారు.

సాక్షాత్తు మీ మామ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని, నేనే ఇంజనీర్ గొప్పలు చెప్పి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.

అన్నారం బ్యారేజీలో ఉన్నా నిటిని వాడుకుందామంటే బ్యారేజీ పిల్లర్లలో నుంచి నీరు లీక్ అవడం వలన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు డ్యాంలో నీరు నిల్వ ఉంటే అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతుందని చెప్పడంతో బాధపడుతూ నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. దీనంతటికి కారణం మీ నిర్వాకమే అని మండిపడ్డారు.

అయినా సరే రైతాంగానికి ఇలాంటి ఇబ్బంది తలేత్తకుండా నీరు అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కేటీఆర్,హరీష్ రావు వాక్యాలు చూస్తూ ఉంటే వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు పడకుండా ఉండాలని కొరుకుంటున్నట్లు అర్థమవుతుందన్నారు.

కెసిఆర్,కేటీఆర్,హరీష్ రావు రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు.
ప్రజలందరూ బిఆర్ఎస్ నాయకుల మాటలు గమనించాలని, వారి మాటలను తీవ్రంగా. ఖండిస్తున్నామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version