ఆక్రమణలపై పొంగులేటి కఠిన వైఖరి

అధికార్లకు ఆదేశాలు

ధరణి అక్రమాలపై దృష్టి

పూర్తి ధాన్యం సేకరణకు హామీ

సేకరణ కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోండి: రైతులకు సూచన

అరెస్ట్‌ ప్రకటన వెనుక రాజకీయ మతలబు!

పనితో పాటు ప్రచారం అవసరమే

ప్రతి పనిలో సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న పొంగులేటి

రాజకీయాల్లో పరిణితి

హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగిస్తున్న నేపథ్యంలో గృహనిర్మాణ మరియు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి రాష్ట్రంలో ఒక అంగుళం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికావడానికి వీల్లేదని ఇటీవల తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. సా మాన్యులకు మేలు చేసే రీతిలో రాష్ట్ర రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో తహసీల్దార్లపై కేసుల విషయంలో కలెక్టర్ల అనుమతి తప్పనిసరి చేశారు. దీనివల్ల తహసీల్దార్లు స్వేచ్ఛగా నిష్సక్షపాతంగా తమ విధులను నిర్వర్తించడానికి వీలవుతుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరిణి వల్ల చాలామంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసు కుంటుందని హామీ ఇవ్వడం ఊరట కలిగించే చర్య. తహసీల్దార్ల సమస్యలను పరి ష్కరిస్తామని స్పష్టం చేయడమే కాకుండా ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా కఠినచర్యలు తీసుకోవాని ఆదేశించారు. రైతులకు, ప్రజలకు మేలు జరిగే రీతిలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెస్తామని కూడా ఆయన వెల్లడిరచడం సమస్యలను పరిష్కరించడానికి ఆయన చురుగ్గా ముందుకెళుతున్నారన్న సత్యాన్ని వెల్లడిస్తోంది.

ధరణిలో అక్రమాలు

ధరిణిలో జరిగిన లోపాలను అక్రమాలను త్వరలోనే వెల్లడిస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌ కార్యకలాపాలను నేషనల్‌ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)కి అప్పగించారు. ఇప్పటివరకు ఈ వెబ్‌సైట్‌ను ఒక విదేశీ కంపెనీ నిర్వహించిందని, ఇందులో జరిగిన అవగతవకలకు సంబంధించిన ఫైళ్లు ఇప్పటికే బయటకుతీశామని ఆయన చెప్పారు. ధరణి రాకముందు భూమిపై యాజమాన్యహక్కు నిర్ధారించేందుకు 32 కాలమ్‌లు వుండేవి. వాటిని బి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం కేవలం ఒక్క కాలమ్‌కు మాత్రమే కుదించడంతో వేలాదిమంది రైతులకు చెందిన లక్షలాది ఎకరాల భూములకు సంబంధించి సమస్యలుఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ధరణి రికార్డుల్లో యాజమాన్య హక్కులకుసంబంధించి 13`14 కాలమ్‌లతో కొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది. దీనివల్ల యాజమాన్య హక్కులకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది. ధరణిలో వున్న 35 మాడ్యూల్స్‌ను ఒకేవేదిక కింద ఒకే మాడ్యూల్‌గా మార్పు చేస్తారు. అంతేకాదు శ్రీనివాసరెడ్డి అందించిన వివరాల ప్రకారం త్వరలోనే ప్రభుత్వం ‘రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ యాక్ట్‌`2024’ను కొత్త పేరుతో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా విపక్షనేతల సల హాలు సూచనలు పరిగణలోకి తీసుకొని ఈ చట్టాన్ని భూయజమానులకు సానుకూలంగా వుండేలా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా ప్రభుత్వం విలేజ్‌ రెవెన్యూ అధికార్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టనుంది.

కొత్త చట్టానికి నేపథ్యం

తెలంగాణలో ప్రభుత్వం భూముల ఆక్రమణ విపరీత స్థాయికి చేరుకోవడంతో రేవంత్‌ ప్రభుత్వందీన్ని అరికట్టేందుకు కఠినచర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు ఇటువంటి ఆక్రమణపై సమర్థవంతమైన చర్యలు తీసుకొని, అక్రమార్కులను శిక్షించడానికి తగినంత ప దునుతేలి వుండకపోవడంతో, తేలిగ్గా తప్పించుకోవడానికి వీలవుతోంది. 1982లో ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌ కాలంలో ‘తెలంగాణ ల్యాండ్‌ గ్రాబింగ్‌ (ప్రొహిబిషన్‌) చట్టం’ అమల్లో వుండేది. ప్రభు త్వభూమి ఆక్రమణకు గురైనట్టు తేలితే, ఇందుకు కారణమైన వ్యక్తులకు ఆరు నెలలనుంచి ఐదేళ్లవరకు జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధించేందుకు ఈ చట్టం వీలుకల్పించేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎత్తివేయడంతో అక్రమార్కులకు అడ్డేలేకుండా పోయింది. ఈ కేసులను విచారించడానికి నెలకొల్పిన ప్రత్యేక కోర్టుల్లో కేసుల నిర్ణీత సమయంలో కేసుల విచారణ పూర్తిచేయాలన్న నిబంధన బాగానే వున్నప్పటికీ, అక్రమార్కులు తేలిగ్గా తప్పించుకుంటున్న నేపథ్యంలో ఈ చట్టంవల్ల ప్రయోజనం లేదని బి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం వాదించింది. 1905నాటి భూఆక్రమణ చట్టం ఈ కేసులను విచా రించడానికి సరిపోతుందని కూడా అప్పట్లో పేర్కొంది. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా వున్ననేపథ్యంలో ఈ చట్టాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్లు రాష్ట్రంలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని పునరుద్ధరించడం అత్యంత అవసరం. ప్రస్తుతం ఈ భూ ఆక్రమణ నిరోధక చట్టాలు గుజరాత్‌, ఒడిషా, కర్ణాటక మరియు అస్సాం రాష్ట్రాల్లో అమల్లో వున్నా యి. వీటన్నింటిలోకి గుజరాత్‌ రాష్ట్రం అమలు పరుస్తున్న చట్టం చాలా పకడ్బందీగా వుండటం గమనార్హం. దీని ప్రకారం భూఆక్రమణ నిజమని తేలితే నేరస్థులకు పదేళ్ల జైలుశిక్ష విధిస్తారు.

సజావుగా ధాన్యసేకరణ

ధాన్యం, పత్తి సేకరణ సజావుగా సాగేందుకు పొంగులేటి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదుపంట ఉత్పత్తుల సేకరణ కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీ సుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీచేయడమే కాదు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కూడా. ఇదే సమయంలో సేకరించిన ధాన్యం, పత్తి మొదలైన పంట ఉత్పత్తులకు చెల్లింపులు సకా లంలో జరిపేలా ఆయన గట్టిచర్యలు తీసుకున్నారు. రైతులు పండిరచిన ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇదే సమయంలో ఎండబెట్టిన వరిధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న నేప థ్యంలో రైతులు మధ్య దళారీలను ఆశ్రయించకుండా, కేవలం ప్రభుత్వ ధాన్య సేకరణ కేంద్రాల్లోమాత్రమే తమ ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టాలని కోరారు. అంతేకాదు అర్హులైనవారికి ఇందిరమ్మఇళ్లు కేటాయించడంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వివిధ జిల్లాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ల పంపిణీ అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షస్తున్నారు.

అరెస్టుల రాజకీయం

ఫోన్‌ ట్యాపింక్‌, ధరణి పోర్టల్‌, కాళేశ్వరం ప్రాజెక్టు స్కాంలకు బాధ్యులైన నాయకులను త్వరలోనేఅరెస్ట్‌ చేస్తామని ప్రకటించడంద్వారా పొంగులేటి సంచలనం సృష్టించారు. ఈ ప్రకటనలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ స్కాంలకు సంబంధించి నెం.1నుంచి నెం.8వరకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనిఆయన హెచ్చరించారు. వీటికి సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ పూర్తయిందని, ఇక చర్య కు ఉపక్రమించడమే తరువాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బినామీల పేర్లతోమూసీనది పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. విచిత్ర మేమంటే ఈ అరెస్ట్‌లు దీపావళికి ముందే జరుగుతాయని ఆయన చెప్పిన్పటికీ, ఇప్పటికీ అమలు కాకపోవడం గమనార్హం. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే తెలంగాణ రాజకీయాల్లో అంతకు మించిన సంచలనం మరోటుండదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. విద్యుత్‌ కమిషన్‌విచారణకు నోటీసులు పంపినా కె.సి.ఆర్‌. హాజరు కాలేదు. ఇరిగేషన్‌ కమిషన్‌ విచారణకు ఇంకా పిలవాల్సి వుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావుకు ప్రభుత్వానికి మధ్య దాగుడుమూతలు జరుగుతున్నాయి. ఆయన అమెరికాలో గ్రీన్‌కార్డు సంపాదించుకోవడంతో, ఇక్కడికి రప్పించడం కష్టంగా మారింది. ఇన్ని అవాంతరాల మధ్య పొంగులేటి దీపావళికి ముందే ఈ అరెస్టు బాంబులు పేలతాయని చెప్పడంలో మతలబు ఏమిటో అర్థంకాదు. కేవలం బెదిరించడానికి అ లా చెప్పివుండకూడదనేంలేదు. ఇదే సమయంలో ఇటువంటి వార్తలు మంచి ప్రాచుర్యం కలిగిస్తాయి కూడా! రాజకీయాల్లో మనగలగాలంటే ప్రచారంలో వుండటం కీలకమే కదా! చేస్తున్న పని తో పాటు కాస్త ప్రచారం ‘మసాలా’ వుండటం కూడా రాజకీయ నాయకులకు అవసరం! ఈవిషయం పొంగులేటికి బాగా తెలిసినట్టుంది! బి.ఆర్‌.ఎస్‌. అవకతవకలపై నియమించిన రెండు క మిషన్లు కె.సి.ఆర్‌.నే వేలెత్తి చూపాయి? మరి ఆయన అరెస్ట్‌ ఇంతవరకు జరగలేదు! ఇక కె.టి.ఆర్‌. ఈ మొత్తం పరిణామాలను రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ పరిణామాల మధ్య కె.సి.ఆర్‌, కె.టి.ఆర్‌, హరీష్‌రావులాంటి వారిని అరెస్ట్‌ చేయడం కొరివితో తలగోక్కున్నట్టవుతుందన్న సంగతి తలపండిన కాంగ్రెస్‌ నాయకులకు తెలియంది కాదు. మళ్లీ వారికి సానుభూతి పెరిగి అసలు ప్రభుత్వానికే ఎసరు రావచ్చు. అందువల్ల తెలివిగా శ్రీనివాసరెడ్డి ఒక బెదిరింపు ఆస్త్రాన్ని ప్రయోగించారనుకోవాలి. దీనివల్ల రెండు లాభాలు ఒకటి ప్రచారం లభించడం కాగా రెండవది ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేయడం! పనిచేసే మంత్రిగా, దూకుడు కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యర్థులను ఎదుర్కొనడంలో ఇటువంటి రాజకీయ చాణక్యాన్ని కూడా ప్రదర్శిస్తూ తన పరిణితిని నిరూపించుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version