గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ భవాని సహిత కోటగుళ్లలో శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. జాగరణ చేసుకునే భక్తులు శివ కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎస్సై మచ్చ సాంబమూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులకు పార్కింగ్ స్థలం ఏర్పాటుచేసి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ శివ కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎవరైనా ఇబ్బంది పెట్టే కార్యకలాపాలకు పాల్పడినచో చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడును అన్నారు.