ఫ్రీజర్ ను విరాళంగా అందించిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్స్

మందమర్రి, నేటిధాత్రి:-

దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ సిఎస్సార్ నిధుల నుండి 8 లక్షల విలువ గల మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా స్టోరేజ్ డీప్ ఫ్రీజర్ ను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా అందించింది. గురువారం దేవాపూర్ లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి కు కంపెనీ యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ జోషి మాట్లాడుతూ, కంపెనీ ప్రెసిడెంట్ సత్య బ్రత శర్మ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులు నుండి జిల్లా ప్రజల కొరకు, ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదల వైద్యం కొరకు, అదేవిధంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ల సూచన మేరకు ప్రజల సంక్షేమ కొరకు అందజేయడం జరిగిందని తెలిపారు. దీనిని జిల్లాలోని వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ప్లాస్మా డీప్ ఫ్రిజర్ అందజేయడం మూలంగా జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిమెంట్ కంపెనీ హెచ్ఆర్ జిఎం ఆనంద్ కులకర్ణి, మెటిరియల్ జిఎం బాలమురళి, లైజాన్ అధికారి తిరుపతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చందూరి మహేందర్, కాసర్ల శ్రీనివాస్, సురభి శరత్ కుమార్, బెల్లంపల్లి సబ్ డివిజన్ సభ్యుడు సూరం లక్ష్మీనారాయణ, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!