ఒక లక్ష 65,000 రూపాయలు 90 లీటర్ల మద్యం స్వాధీనం
వనపర్తి నేటిదాత్రి:
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షితమూర్తి ఆదేశానుసారం వనపర్తి జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్లో ఫ రి దీ లో పోలీసులు వాహనాలు తనిఖీ లు నిర్వహించగా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 65,000 రూపాయలు పెద్దమందడి పోలీస్ స్టేషన్, మోజర్ల దగ్గర వాహనాల 1,00,000 రూపాయల కు
ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున పోలీసులుసీజ్ చేశారు
బుధవారం రాత్రివనపర్తి జిల్లాలలో మొత్తం 1,65,000 రూపాయలు 90 లీటర్ల మద్యం పోలీసులుసీజ్ చేశారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తామని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మోడల్ కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు రూ.50వేల రూపాయల నగదు కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లే వారు పెద్ద మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు ఆధారాలను చూపాలని తెలిపారు లేని యెడల నగదు, ఇతర వస్తువులు, బంగారం ఆభరణాలు సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలను స్వేచ్ఛ మరియు నిష్పక్షపాతముగా నిర్వహించడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని
ఎస్పీ ఒక ప్రకటన లో తెలిపారు
జిల్లాలో పోలీసులు వాహనాల విస్తృత తనిఖీలు
