మిడ్జిల్ మండలంలో ఎన్నికల శంఖారావం..

కుర్వగడ్డపల్లి మీనాంబర శివాలయాన్ని దర్శించుకున్నా చల్లా వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని గురువారం రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని కుర్వగడ్డపల్లి మీనాంబర శివాలయాన్ని చల్లా వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బైరంపల్లి గ్రామంలో ఖాళీ అయిన బిఆర్ఎస్ పార్టీ..

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపిటిసి శివప్రసాద్ తో పాటు 20 కార్యకర్తలు…

మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశి చంధ్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తెలిపారు.
మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపిటిసి శివప్రసాద్ తో పాటు 20 కార్యకర్తలు గురువారం రోజు పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి,జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వంశీచంధర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మిడ్జిల్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version