మహా పోలీస్ శభాష్

10 గంటల్లో నిందితుల ను పట్టుకున్న పోలీసులు.

మద్యం మత్తులో మీనార్లు ధ్వంసం చేశామని ఒప్పుకున్న యువకులు.

సర్కిల్,ఆమీన్ లను అభినందించిన,డి ఎస్ పి.

సున్నిత వ్యవహారాలను సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయవద్దు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఖబరస్తాన్ ప్రధాన గేటు వద్ద ఉన్న పిల్లర్ల గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం చేసిన సంఘటన సోమవారం మండలం అంతా పాకిపోవడం ఒక వర్గానికి చెందిన మనోభావాలు దెబ్బతీసే విధంగా సంఘటన జరగడం, అది కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఈ దుర్ఘటనకు పాల్పడడం మరింత చర్చనీయంగా మారింది. స్థానిక జాబి మస్జిద్ అధ్యక్షుడు మొహమ్మద్ గయాస్ ఉద్దీన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీస్ విచారణ చేపట్టి కేవలం 10 గంటల్లోనే నిందితులను పసిగట్టి అదుపులోకి తీసుకోవడం మహాదేవపూర్ డి.ఎస్.పి రామ్మోహన్ రావు సర్కళ్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు టీంకు అభినందించడం జరిగింది.

***********

మహాదేవపూర్ ఖబరస్తాన్ ప్రధాన గేట్ మినార్ ల ధ్వంసానికి సంబంధించి నిందితులకు డీఎస్పీ రామ్మోహన్రావు ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరు పరచడం జరిగింది. నిందితుల వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి, ఆదివారం రాత్రి మద్యం మత్తులో మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన నస్పూరి సాగర్ అలియా సాయి, తండ్రి శ్రీనివాస్, 20 సంవత్సరాలు వృత్తి కూలీ, మరో నిందితుడు జోడు పవన్ సన్నాఫ్ దుర్గయ్య కులం ముదిరాజ్ వయసు 24 వృత్తి ఫోటోగ్రఫీ అధిక మద్యం సేవించి ఆదివారం అర్ధరాత్రి కబ్రిస్తాన్ ప్రహరీ గోడ వద్ద ఉన్న మినార్ లను ధ్వంసం చేయడం జరిగిందని, విచారణలో నిందితులు ఒప్పుకోవడం జరిగిందని అన్నారు, మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో పల్లె ప్రకృతి వనం వద్ద వీరికి అదుపులో తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఒక మతపరమైన సున్నిత వ్యవహారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని ప్రస్తుతం ఈ కేసు విషయం పోలీసులు పరిగణంలోకి తీసుకొని నిందితులను పట్టుకోవడం కోర్టుకు హాజరు పరచడం జరిగిందని, ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రామ్మోహన్రావు తోపాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్ర రావు, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, తమాషా రెడ్డి, రమేష్, తో పాటు సర్కిల్ పరిధిలోని పోలీసులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version