వనపర్తి లో ఆక్రమణలను కూలగొట్టాలి చైర్మన్ కు వినతిపత్రం…

వనపర్తి లో ఆక్రమణలను కూలగొట్టాలి చైర్మన్ కు వినతిపత్రం

ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డును ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చి కూలగొట్టాలని స్థలాన్ని మున్సిపాలిటీ కి స్వాధీనo చేసుకోవాలని జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ మీడీదొడ్డి మాధవి రమేష్ కు ఆమె నివాసంలో కలిసి వినపత్రం ఇచ్చామని సతీష్ యాదవ్ తెలిపారు కర్నూల్ రోడ్డులో పానగల్ రోడ్డులో రోడ్డు చిన్నదిగా ఉన్నదని తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇంతవరకు కూలగొట్టలేదని ఆయన ఫిర్యాదు చేశారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి ఆదేశాలు పరిగణలోకి తీసుకొని విది విధానాలు రూపొందించి వెంటనే రోడ్ల విస్తరణ పనులు ఆక్రమణాలను కూల గొట్టాలని ఆయన కోరారు అదేవిధంగా వనపర్తి పట్టణంలో పార్కుల స్థలాలు కబ్జాల కు గురయ్యాయని కొంతమంది రోడ్ల పక్కన మోరీలపై షెడ్లు నిర్మించి అద్దెలకు ఇచ్చారని మోరీలపై రేకుల షెడ్లు వేశారని వాటిని తొలగించాలని ఆయన కోరారు రోడ్ల విస్తరణలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వనపర్తి లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి జరిమానాలు విధించాలని ఆయన కోరారు పాత మార్కెట్ యార్డులో సమీకృత షాపింగ్ కాంప్లెక్స్ ను టెండర్లు నిర్వహించి అద్దెలకు ఇవ్వాలని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని అదేవిధంగా చిన్న కిరాణం వ్యాపారస్తులకు స్వల్ప అద్దె కు ఇవ్వాలని కోరారు కమాన్ చౌరస్తా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రోడ్డు చిన్నదిగా ఉండడం వల్ల సంత ప్రతి ఆదివారం ఉంటుందని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు పాత మార్కెట్ యార్డ్ సమీకృత షాపింగ్ కాంప్లెక్స్ కూరగాయల వ్యాపారులకు చిన్న కిరాణా వ్యాపారులకు అక్కడ వ్యాపారం చేసుకొనుటకు షాపులు ఇప్పించాలని ఆయన కోరారు రాజీవ్ చౌక్ నుండి రాజావారి పాలిటెక్నిక్ కళాశాల వివేకానంద చౌరస్తా నుండి కర్నూల్ రోడ్డు వరకు రోడ్డు సెంటర్ నుండి అటు ఇటు ఎవరికి నష్టం జరగకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆక్రమణలను కొలగొట్టాలని ఆయన చైర్మన్ కి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు అదేవిధంగా మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆయన కోరారు పట్టణ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ ను కోరారు చట్టంలో అందరు సమానులేనని అక్రమ ఆక్రమణలపై మున్సిపల్ లో కమిషనర్ తో చర్చించి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆదేశాలను పరిగణంలోకి తీసుకొని తొలగించాలని ఆయన కోరారు ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొత్త గొల్ల శంకర్ వెంకటేశ్ చంద్రశేఖర్ దయనంద్ ముదిరాజ్ రామస్వామి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version