సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల మార్కెట్ యార్డు సొసైటీ కోఆపరేటివ్ చైర్మన్ కొడూరు భాస్కర్ గౌడ్ కి జిల్లా సిపిఐ పార్టీ పంతం రవిఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడు మావులను వెంట వెంటనే ప్రభుత్వం చెల్లించాలని హమాలీ కార్మికుల వేతనం పెంచాలని ఈరోజు జిల్లెల్ల నాలుగు గ్రామాలకు సంబంధించిన హమాలీలు చైర్మన్.కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర సరుకులకు ధరలు పెరిగాయని హమాలీలకు వేతనాలుపెంచాలని అమాలి కార్మికులు పనిచేస్తున్న చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని అమాలి కార్మిక లోడ్ చేస్తున్న సమయంలో తాడు మావులను వెంట వెంటనే చెల్లించాలని అమాలి కార్మికుల లో ఎక్కువ శాతం పేదరికంతో జీవిస్తున్నారని వారికి ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తూ ప్రభుత్వం అన్ని పథకాలు మొదటి స్థానం కల్పించాలని కార్మికులు పని సమయంలో ప్రమాదానికి గురైతే వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అమాలి కార్మికులకు కూడా భవననిర్మాణ కార్మికులకు ఇచ్చే లేబర్ కార్డు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హమాలీలకు సంబంధించిన అన్నిసమస్యలు పరిష్కరించాలని రేపు జిల్లా కలెక్టర్ గారికి వేతనాల పెంపు కొరకు సమస్యల పరిష్కారం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల హమాలీలు నాయకులు హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు హమాలి సంఘ జిల్లా నాయకులు బచ్చపల్లిశంకర్ పిట్టల బాలయ్య రాయ నర్సు శంకరన్న తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version