త్రాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని శివాలయం మరియు చుట్టుపక్కల నివసించే వారికి త్రాగునీటి సమస్య ఉందని కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి మంగళవారం రోజున బోర్వెల్ పనులు చేపించడం జరిగింది. త్రాగునీటి సమస్య తీర్చినందుకు ఇందారం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల్ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మనసున్న ఎమ్మెల్యేకి త్వరలోనే మంత్రి పదవి దక్కాలని భగవంతుని ప్రార్థించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version