ప్రచారాలకు అనుమతి తప్పునిసరి
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలకు అనుమతి పొందాలని తాహాసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. అభ్యర్థులు తప్పకుండా ప్రచారాలకు అనుమతి పొందాలని, శాంతిభద్రతలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఎన్ఓసి తీసుకోవాలని తాహాసిల్దార్ శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
