పరకాల,నడికూడా మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాఖీ గిఫ్ట్ ఆఫర్స్ పేరుతో లింకులు వస్తే ఓపెన్ చేయొద్దు
పరకాల సీఐ క్రాంతికుమార్
పరకాల నేటిధాత్రి
రాఖీ పండుగ రానున్న
నేపథ్యంలో పరకాల,నడికూడా మండలాల ప్రజలు సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాఖీ గిఫ్ట్ లేదా గ్రీటింగ్స్ అంటూ వచ్చే ఫేక్
లింకులను క్లిక్ చేయవద్దని,వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ మరియు షేర్ చేయవద్దని సైబర్ మోసాల పట్ల అవగాహనతోనే నేరాలను అరికట్టవచ్చని,సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి స్థానిక పోలీస్ స్టేషన్ లో గాని 1930కు గాని కాల్ చేయాలని పేర్కొన్నారు.
