నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్‌.

# భారీ స్థాయిలో పోలీసులకు పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు.

# నిషేధిత గడ్డి మంది స్వాధీనం.

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

అన్నదాతను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా హెచ్చరించారు.
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డిమందును విక్రయిస్తున్న మరో నిందితుడితో కలిపి టాస్క్‌ఫోర్స్‌, గీసుగొండ పోలీసులు సంయుక్తంగా కల్సి ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. ఈ రెండు సంఘటనల్లో పోలీసులు సుమారు పది లక్షల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలు రెండు సెల్‌ఫోన్లు, లక్ష పది వేల రూపాయల విలువగల 122 లీటర్ల నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడించారు.వరంగల్‌ జిల్లా సంగెం మండలం గాంధీనగర్‌ చెందిన నిందితుడు కోడూరి శ్రీనివాస్‌రావు,తనకు వరసకు మామా ఆయిన సూర్యపేట జిల్లా, తిరుమలగిరి ప్రాంతానికి చెందిన నగామల్లేశ్వర్‌ రావుతో (పస్తుతం పరారీలో వున్నాడు) కల్సి, అంధ్రప్రదేశ్‌,కర్నాటక,మహరాష్ట్ర రాష్ట్రాలకు భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ప్రస్తుతం పరారీలో వున్న గుంటూరు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన ఏటుకూరి సుబ్బరావు వద్ద ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన కోడూరి శ్రీనివాస్‌ రావు తమ మామతో కల్సి పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కోనుగోలు చేసారు.నిందితులు కోనుగోలు చేసిన విత్తనాలు గ్లయ్పొసెట్‌ గడ్డి మందుకు తట్టుకోనే శక్తి కలిగి వుండటంతో పాటు పత్తి దిగుబడి అధికమని, ఎక్కువమార్లు కలుపు తీయాల్సిన అవసరం లేదని, స్థానిక అధీకృత డీలర్ల వద్ద ఈ విత్తనాలు లభ్యంకావని తప్పుడు ప్రచారం చేసి రైతులను నమ్మించి ఎక్కువ ధరకు నిందితుడు శ్రీనివాస్‌రావు తన ఇంటి వద్ద నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకుగా పన్నాగంపడగా, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌,సంగెం పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించగా విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలతో పాటు, ప్రభుత్వ నిషేధిత 50 లీటర్ల గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకోని నిందితుడు శ్రీనివాస్‌రావు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.మరో సంఘటనలో సంగెం మండలం, తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన మెంతుల రాజేష్‌ ప్రభుత్వం పూర్తి నిషేధించిన గడ్డి మందుకు ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితుడి ఇంటిలో తనీఖీ చేయగా 72 లీటర్ల గడ్డి మందును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

# నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్‌..

అన్నదాతను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని. ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే 8712685070 వాట్సప్‌ నంబర్‌కు సమచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.ఈ రెండు సంఘటనల్లో నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపిఎస్ శుభంనాగ్,స్పెషల్‌ బ్రాంచ్ ఏసిపి జితేందర్‌ రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి మధుసూధన్‌, ఇన్స్‌స్పెక్టర్లు సార్ల రాజు, ఎస్‌.రవికుమార్‌, ఎస్‌.ఐలు నిస్సార్‌పాషా, శరత్‌కుమార్‌, సంగెం ఎస్‌ఐ నరేష్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, మండల వ్యవసాయ అధికారి యాకయ్య, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఏఎస్‌ఐ ఉప్పలయ్య, హెడ్‌కానిస్టేబుల్స్ అశోక్‌, శ్రీనాథ్‌, మాధవరెడ్డి, కానిస్టేబుల్స్ రాజేష్‌, భిక్షపతి, సురేష్‌, సాంబరాజు, నరేష్‌, కిరణ్‌, శ్రావణ్‌, సతీష్‌, శ్రీనివస్‌, నాగరాజు ఇతర వ్యవసాయధికారులను పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version