‘‘దృష్టి లేని’’..’’దిష్టి కూతలు’’?

’’కోనసీమ మీద’’.. ‘‘తెలంగాణ దిష్టి’’ అంటూ ‘‘పవన్‌ కళ్యాణ్‌’’ వెకిలి కామెంట్లు.

`‘‘తెలంగాణా మీద’’ మరోసారి ‘‘పవన్‌ విషపు వ్యాఖ్యలు’’

`‘‘పవన్‌’’ మతితప్పి,గతి తప్పిన ‘‘మాటలు’’!

`చదువు సంస్కారం లేని ‘‘సన్నాసిలా సుద్దులు’’

`‘‘పవన్‌ కళ్యాణ్‌’’ పనికి రాని ‘‘సొల్లు పురాణాలు’’

`పసలేని ‘‘పవన్‌’’ పైత్యానికి ‘‘రోత రొచ్చులు’’

`కడుపులో వున్న విషానికి ఆ మాటలే సాక్ష్యాలు

తెలంగాణా వచ్చి పన్నెండేళ్ళైనా ఇంకా మండుతున్న కడుపులు

`తెలంగాణా రావడం జీర్ణిచుకోలేని నీతి లేని దౌర్బాగ్యులు

`తెలంగాణలో వున్నప్పుడు నేల గురించి గొప్పలు

`ఊరు దాటగానే తెలంగాణా మీద వెకిలి వ్యాఖ్యలు

`రాజకీయ పరిణతి లేమి అతి తెలివికి అలంకారాలు

`తెలంగాణా కడుపులో పెట్టుకొని చూసుకున్నా కొందరి కడుపుమంట చల్లారదు

తెలంగాణా మీద ‘‘విషం చిమ్మిన పవన్‌’’ సినిమాలు ఈ గడ్డ మీద ఆడనివ్వొద్దు

`ఏ రాజకీయ పార్టీలు భవిష్యత్తులో ‘‘పవన్‌’’ తో అంటకాగొద్దు

`నీతి బాహ్యమైన వ్యక్తిత్వవానికి నీడలు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
దుష్టులు చేసే రాజకీయం దుర్మాంగంగానే వుంటుంది. నిష్టూరపు వ్యాఖ్యలు నీచులే చేస్తారని మరోసారి ఏపి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తన విషాన్ని కక్కి నిరూపించుకున్నారు. తెలంగాణ ఉద్యమన్నా, తెలంగాణ ఏర్పాటు అనేది ఆయనకు ఎంత కడుపు మంటగా వుందో మరోసారి రుజువు చేసుకున్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల తాను పదకొండ రోజులు నిద్రాహారాలు మానుకున్నానని చెప్పి,ఏపి ప్రజల మెప్పు పొందిన పచ్చి అవకాశవాది పవన్‌ కాళ్యాణ్‌. కడుపుకు అన్నం తినే వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా సరే బేష్‌ అంటారు. కాని అన్నం తిని అశుద్దం మాటలు మాట్లాడితే చీ కొడతారు. సమాజం నుంచి వెలి వేస్తారు. తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం. తెలంగాణ అంటే సమసమాజం. తెలంగాణ ఒక చైతన్య కిరణం. తెలంగాణ అంటే ఒక నిబ్బరం.తెలంగాణ అంటే తెగింపు నిదర్శం. తెలంగాణ అంటే నిత్య కల్యాణం పచ్చ తోరణం. అది ఆనాడైనా, ఈనాడైనాతెలంగాణ ప్రజల్లో వున్న భావన అంతా వసుదైక కుటుంబం. తెలంగాణ ప్రాంతానికి ఈనాడు కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి ఉత్తరాది, దక్షిణాది అని తేడా లేకుండా ఎంత మంది వచ్చినా కడుపులో పెట్టుకుంటుంది. కలసి సాగుతుంది. తెలుగు జాతీ మనది అని తియ్యటి మాటలు చెప్పి, తెలంగాణను ఏకం చేసుకొని అరవై ఏళ్లు గోస పెట్టి ఆంద్రా నాయకులను ఏనాడు తెలంగాణ తిట్టలేదు. తెలంగాణలోవున్న స్వార్ధపరులనే తిట్టింది. అంత గొప్పది తెలంగాణ. అలాంటి తెలంగాణ నాయకుల వల్ల కోనసీమ ఎండిపోయిందా? తెలంగాణ నాయకుల దిష్టి వల్ల కోనసీమ పాడైపోయిందా? కొబ్బరి చెట్ల కిందకూర్చుంటే హాయిగా వుంటుందని పొగడడంకూడా దిష్టిగా పవన్‌ కళ్యాణ్‌కు వినిపించిందా? అలాంటి మాటలు మాట్లడడానికి పవన్‌కు సిగ్గుండాలి. అదే వుంటే ఇలాంటి వెకిలి మాటలు మనిషన్న వాడు ఎవడూ మాట్లాడడు. ఎక్కడో వున్న కోనసీమను తెలంగాణ నాయకుల్లో కనీసం పదిశాతం కూడా చూసి వుండరు. అయినా టూరిజం కోనసీమ అందాలు అని ఇంకా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు అక్కడి ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేస్తోంది? దాని మీద ఓ గొడుగు వేసి కప్పేసుకో..ఎవరు వద్దన్నారు. నిన్నటి దాక గత ఏపి జగన్‌ ప్రభుత్వం పరదాల ప్రభుత్వం అని దెప్పిపొడిచినట్లే , ఇప్పుడు కోనసీమ మొత్తం పరదాలు కప్పుకో..ఎవడొద్దన్నాడు? తెలంగాణ ఉద్యమం ఏనాడు ఏపి ప్రజలకు వ్యతిరేకం కాదు. ఏపి నాయకులకు వ్యతిరేకం కాదు. రెండు ప్రాంతాల మధ్య పవన్‌ కళ్యాణ్‌లా చిచ్చు పెట్టిన నాయకుడు ఎవరూ లేరు. అలాంటి పవన్‌ కాళ్యాన్‌ను ఏపి ప్రజలు కూడా క్షమించొద్దు. నాయకులు వస్తుంటారు.పోతుంటారు. కాని రెండు ప్రాంతాలు, ప్రజలు శాశ్వతం. తేనెచుక్కలో నీటి చుక్కలు వేసే పవన్‌ కళ్యాణ్‌ లాంటి నాయకుడిని ఏపి ప్రజలు దూరం పెట్టాలి. రాజకీయ భవిష్యత్తు బొంద పెట్టాలి. లేకుంటా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేసి, తన రాజకీయ పబ్బం కోసం ప్రాంతాల మద్య చిచ్చు పెడతారు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ కూడా ఏనాడు ఏపి ప్రాంతం మీద మాట్లాడలేదు. ఉద్యమ కాలంలో కూడా ఏనాడు ఏపి ప్రజల మీద ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. నిండు అసెంబ్లీలో కూడా ఏపి రైతులు సంతోషంగా వుండాలనే కోరుకున్నారు. అక్కడ రైతులు సుబిక్షంగా వుండాలనే అన్నారు. అంతెందుకు కేసిఆర్‌ పాలించిన పదేళ్లలో కూడా రాయలసీమ రైతులకు పూర్తి స్దాయిలో నీళ్లందాలనే కోరుకున్నారు. కృష్ణాలో మిగులు జలాలు రాయలసీమకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా కృష్ణాలో తెలంగాణకు అవసరమైన 500టిఎంసిలు పోగా మిగిలిన వరద, మిగులు జలాలు తీసుకెళ్తామంటే అభ్యంతరం లేదన్నాడు. ఇదీ తెలంగాణ నాయకుల గొప్పదనం. తెలంగాణలో వుంటావు. తెలంగాన నుంచే నిత్యం ఏపికి వెళ్లాడు. ఎన్నుకున్న ప్రజల మధ్య వుండలేని నాయకుడు పవన్‌ కళ్యాణ్‌. అలాంటి వ్యకిని సిని రంగంలో ఆదరించింది తెలంగాణ. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలను హిట్‌ చేసింది తెలంగాణ. చిరంజీవి సినిమాలకు రెవిన్యూ మొత్తం తెలంగాణ. అలా తెలంగాణ ప్రజల సొమ్ము తిని తెలంగాణ ప్రజలు దిష్టిపెడుతున్నారని చెప్పడానికి పవన్‌కు సిగ్గు కూడా అనిపించలేనట్లుంది. ఇలాంటి మకిలి వ్యాఖ్యలు చేసిన పవన్‌ కళ్యాణ్‌నుతెలంగాణ ప్రజలు సహించొద్దు. హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణ మొత్తం కొన్ని లక్షల మంది ఏపి ప్రజలు జీవిస్తున్నారు. కొన్ని లక్షల మంది స్ధిరపడ్డారు. ఆది నుంచి ఏనాడు రెండు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలేదు. ఉద్యమ కాలంలోనూ ఎలాంటి వివక్ష తెలంగాణ ప్రజలు చూపలేదు. పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలోనూ ఏపి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొలేదు. ఇప్పుడు, ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగానే కలిసి వుంటున్నారు. అలాంటి ప్రజల మధ్య విషబీజాలు నింపుకుంటూ పవన్‌ తెలంగాణలో ఎందుకు వుంటున్నట్లు? పాలించమని ఎన్నుకున్న ప్రజల మధ్యవుండలేని అసమర్ద రాజకీయ , స్వార్ధఫూరిత నాయకుడు పవన్‌ కళ్యాణ్‌. ఏపి ప్రజల చమట కష్టంతో కట్టే పన్నులను తన రాకపోకలకు పప్పు బెల్లాల్లా ఖర్చు చేస్తున్న నాయకుడు పవన్‌ కళ్యాణ్‌. అలాంటి ప్రజల నెత్తుటి కూడు తింటూ ప్రజల మధ్య విధ్వేశం రగిలించి చలి కాచుకోవాలనుకునే నాయకులను ప్రజలు దూరం పెట్టాలి. పవన్‌ సినిమాలకే కాదు, రాజకీయాలకు కూడా పనికి వచ్చే నాయకుడు కాదు. పవన్‌ కళ్యాణ్‌ చెప్పే అబద్దాలకు అంతే వుండదు. ఒక్క మాట నిజం వుండదు. ఎక్కడికెళ్తే అక్కడ పుట్టానంటాడు. అక్కడే పెరిగానంటాడు. ఏపిలో వుంటే తమిళ నాడును తిడతాడు. తమిళనాడును పొగుడుతాడు. తెలంగాణలో వుండి కోనసీమలో చేసిన వ్యాఖ్యలు చేస్తే ఆ పూటనే తెలంగాణ ప్రజలు పొలిమేర దాటేదాకా తరిమేవారు? ఇప్పటికైనా సరే తెలంగాణ వాదులు మేలుకొనాల్సి వుంది. ఏపి మీడియా కూడా కావాలనే పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు వైరల్‌ చేయలేదు. ఆ మాటలు పెద్దగా ప్రచారంచేయలేదు. హైదరాబాద్‌లో కొన్ని లక్షల మంది ఏపి ప్రజలు వున్నారు. వారంతా అనేక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ జీవిస్తున్నారు. వారి మీద కలగని దిష్టి, ఎక్కడో వున్న కోనసీమ వరకు వెళ్లిందా? ఇక్కడ పవన్‌ను ఎవడుండమంటున్నాడు? కోనసీమకు వెళ్లి కొబ్బరి తోటల్లో వుండకుండా ఇక్కడెందుకు వుంటున్నట్లు? ప్రజలు ప్రశ్నిస్తే సరిగ్గా సమాధానం చెప్పలేని వ్యక్తి, తెలంగాణను మీద ఇంకా విషం చిమ్మి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు. కోనసీమ పర్యటనలో పవన్‌ కళ్యాణ్‌ ఈ చెంప, ఆ చెంప వాయించినంత పనిచేశారు. కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటే ఏం చర్యలు తీసుకోవాలో అనేది ఆలోచించాల్సింది పోయి, తెలంగాణ మీద పడి ఏడవడం వల్ల ఏం లాభమో పవన్‌ సమాదానం చెప్పి తీరాలి. తెలుగు రాదు. ఇంగ్లీష్‌ రాదు, హిందీరాదు. ఆఖరుకు కోనసీమ యాస కూడా రాదు. ఆ వ్యక్తి 80వేల పుస్తకాలు చదివి సాధించిన విజ్ఞానం అంటే ఇదే. మరి ఎందుకంటే తిరుమలలో ఎర్ర చందనం చెట్లు ఎలా పుట్టుకొచ్చాయన్నదానిపై తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేసి జనం చేత చీ కొట్టించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి తలకు తగిలిన గాయం తో వచ్చిన రక్తం చెట్లకు అంటుకోవడం వల్ల ఎర్ర చందనం చెట్లు ఉద్భవించాయని తన అజ్ఞానాన్ని బైట పెట్టుకున్నాడు. జనం చేత చీచీ అనిపించుకున్నాడు. ప్రజలు అది మర్చిపోక ముందే మళ్లీ తన తెలివి తక్కువ తన్నాన్ని ప్రదర్శించారు. తెలంగాణ వల్లనే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని చెప్పడమంటేనే పవన్‌ దిగజారుడు తనానికి నిదర్శనం. అయినా అలాంటి తెలంగాణలో ఎవరు వుండమంటున్నారు? నిజంగా అంతటి మాట మీద నిలబడే నాయకుడివైతే అమరావతిలోనే వుండు. తెలంగాణకు రాకు. దిష్టి తగలకుండా జాగ్రత్త పడు. ఎవడు కాదంటున్నారు. అటు తెలంగాణ వల్లనే కోనసీమకు ఈ పరిస్దితి అనుకుంటూనే మళ్లీ తెలంగాణకు ఎందుకు రావడం? పవన్‌ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజాసంఘాలు వెంటనే స్పందించాలి. తెలంగాణ రాజకీయ పార్టీలు మౌనం వీడాలి. మరోసారి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడనని పవన్‌ చెప్పే దాకా ఉద్యమాలు చేయాలి. ఆయనసినిమాలు తెలంగాణలో భవిష్యత్తులో విడుదల చేయకుండా అడ్డుకోవాలని తెలంగాణ జనం అంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version