కదలని పంచాయతీ ట్రాక్టర్…..!
◆:- ఎక్కడికక్కడ ఊడిపోతున్న ట్రాక్టర్ విడిభాగాలు
◆:- పట్టించుకోని అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం:గత ప్రభుత్వం ఆయాంలో గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ని మిత్తం పంచాయతీకి ఒకటి చొ ప్పున ట్రాక్టర్లను కొనుగోలు చే సింది. ఈట్రాక్టర్లు ద్వారా ప్రతి ని త్యం గ్రామంలోని చెత్త సేక రించి డంపింగ్ యార్డ్లోకి తర లించేవారు. ఈకార్యక్రమం పం చాయతీ పాలకవర్గం ఉన్నంతవరకు సజావుగానే కొనసాగింది. పంచాయతీ ల పాలకవర్గం గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైనప్పటి నుండి చెత్త సేకరణ విషయం పక్కన పె డితే ట్రాక్టర్ల పర్యవేక్షణ పూర్తి గా కొరవడింది. ఇందుకు ఉదాహరణ ఝరాసంగం మండల పరిధిలోని భో జ్ఞ నాయక్ తండా ట్రాక్టర్ కనబడుతుంది. ప్ర త్యేక అధికారుల పర్యవేక్షణ లో -మా లేక పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యమా కానీ పంచాయతీ ట్రాక్టర్ మా త్రం పెట్టిన దగ్గరనే తుప్పు పట్టడమే కాకుండా ఎక్కడి అక్కడ ట్రాక్టర్ భాగాలు ఉడిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి డాక్టర్ మరమ్మత్తులు చేయించి చెత్త సేకరణకు ఉపయోగించాలని తాండావాసులు కోరుతున్నారు.