నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే కు వినతి
:చెర్ల కొండాపూర్ అనుబంధ గ్రామం “పల్లె “గ్రామస్థుల విన్నపం.
రాయికల్ , జనవరి 23 నేటి ధాత్రి:
మండలం చెర్ల కొండాపూర్ అనుబంధ గ్రామం “పల్లె” గ్రామస్థులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని పార్టీ కార్యాలయంలో కలిసి తమ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా గ్రామ మాజీ సర్పంచ్ అర్మురి లక్ష్మి నారాయణ,పెద్ద మనిషి దువ్వక నర్సయ్యలు మాట్లాడుతూ
చెర్ల కొండాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న పల్లెకు గ్రామ పంచాయతీ కి 1 కి.మీ పైగా దూరం ఉన్నదని,దాదాపు 500 మందికి పైగా జనాభా ఉన్న “పల్లె”గ్రామ వాసులు పెన్షన్ దారులు,రేషన్ కోసం, ఇతరత్ర గ్రామ సమస్యల పరిష్కారం కోసం చెర్ల కొండాపూర్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని,పల్లె ను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ను కోరినట్లు వారు తెలిపారు.అనంతరం గ్రామ నాయకులు,మహిళలు ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమం లో గ్రామ సంఘం
ఉప అధ్యక్షులు నారాయణ,క్యాషియర్ పల్లికొండ శివ,మాజీ అధ్యక్షులు నర్సయ్య, రాజేష్,రమేష్,రాజు,రాజయ్య, లింగమూర్తి,చిన్న రాజాం,మహిళా సంగమ్ అధ్యక్షులు నాగలక్ష్మి,రాజేశ్వరి, లావణ్య,మమత,సువర్ణ,రూప, సుజాత,లలిత, పల్లె ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
