బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
నిన్నటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహంను ఆవిష్కరించాల్సిన స్థానంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన పిలుపుమేరకు మంగళ వారము రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని తెలంగాణ చౌక్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పట్ల నిరసన తెలియజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా ప్రజా ప్రతినిధులు, బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.