సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 17 ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీసి అనంతరం జరిగిన సభకు పార్టీ జిల్లా నాయకుడు వి రాజయ్య అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ, సెప్టెంబరు 17 వారసులు కమ్యూనిస్టులేనని, ఆ పోరాట స్ఫూర్తిని ఈ తరం కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 1946 నుండి 1951 వరకు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటము ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పార్టీలే నిర్వహించాయి. నిజాముకు వ్యతిరేకంగా, ఇస్నూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, వెట్టి సాకిరికి వ్యతిరేకంగా, భాను దొర నీ కాల్మొక్త విధానానికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా, పటేలు పట్వారి జాగీర్ గారు జమీందారు పోలీసు పటేలు విధానానికి వ్యతిరేకంగా ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో తుపాకులు చేత బట్టి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించాయి. ఆ పోరాటంలో భాగంగా మొదటి అమరవీరుడు దొడ్డి కొమురయ్య, తర్వాత సాకలి అయిలమ్మ, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం లాంటి అనేకమంది నాయకులు 4000 మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు పోరాటం అమరులైనారు. మూడువేల గ్రామాల్ని విముక్తి చేసినం. 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెండా పార్టీలది. ఇంటి స్థలాల పోరాటం చేసి ఇంటి స్థలాలు ఇప్పిచ్చిన చరిత్ర ఎర్రజెండాది. భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసేది పోరాటం చేసింది ఎర్రజెండాది. ఆ పోరాటంలో ఆర్ఎస్ఎస్ గాని, బిజెపి గాని లేదు. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆర్ఎస్ఎస్ బిజెపి వక్రీకరిస్తుంది. హిందూ ముస్లింల తగాదుగా తెలియజేస్తుంది. దానికి నిదర్శనమే రజాకార సినిమా. తెలంగాణ రైతన్న సాయుధ పోరాటం విలీన దినమని, విమోచన దినమని, సమైక్య దినమని, ప్రజా పాలన పేరుతోనే ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 15 జరుపుతుంది. అసలు విషయం 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతాన్ని భారత యూనియన్ లో విలీనం చేసిన రోజు. కాబట్టి ఇది విలువైన దినోత్సవం తప్ప మరి ఏది కాదు. సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా జరపాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ భూములన్నీ పేదలకు పంచాలి. ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలి. గుడిసె లేసిన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఉనికిపుచ్చుకొని భవిష్యత్తులో సమరశీల పోరాటాలు చేయాలని సిపిఎం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుదారి రమేష్, గడప శేఖర్, మేకల మహేందర్, సినిమాల రవికుమార్, నూనేటి నరేష్, మునుకుంట్ల రాజేందర్, వంగాల లక్ష్మి, రజిని, భారత్ అక్క, బక్కమ్మ, ప్రభాకర్, రాజశేఖర్, బిక్షపతితదితరులు పాల్గొన్నారు.