మన ఐక్యతే మన బలం — మన బలమే మన అభివృద్ధి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ
మహమ్మద్ యాకూబ్ షరీఫ్,, మేదపల్లి గ్రామ ప్రజలకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాను.గ్రామ పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ పంచాయతి బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల గ్రాంట్‌ను మంజూరు చేస్తుంది.మన గ్రామాభివృద్ధి పట్ల నా బాధ్యతగా, నేను మేదపల్లి గ్రామంలో సర్పంచ్ పంచాయతి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, నేను వ్యక్తిగతంగా మన గ్రామానికి మరొక 10 లక్షల రూపాయలను గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా అందిస్తానన్నారు.ఏకగ్రీవ నిర్ణయం అంటే కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు —
మన గ్రామం కలసి ముందుకు సాగాలనే ఐక్యతకు అది ఒక సంకేతం. అన్నారు
