ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్ర బోస్ కి సన్మానం.
పుస్తకాలు అందచేసిన సామాజిక రచయితల సంఘము.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మారుమూల ప్రాంతం చల్లగారిగ లో పుట్టి ప్రపంచ ఖ్యాతి ని సంపాదించి ప్రపంచంలోనే గొప్ప అవార్డు అయినా ఆస్కార్ పురస్కారం అందుకున్న*చిట్యాల మండల చల్లగరిగ ముద్దుబిడ్డ చంద్రబోస్ తన అవార్డ్ పేరుతో గ్రామం లో గురువారం రోజున ఆస్కార్ గ్రంధాలయం ను తన స్వంత ఖర్చులతో నిర్మించి ప్రారంభోత్సవము* చేశారు, ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సామాజిక రచయితల సంఘం అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి మరియు మిత్ర బృందం పాల్గొన్నారు ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంత గొప్ప మహా కార్యక్రమం ని తలపెట్టి గ్రంధాలయం ని విజ్ఞాన బండాగారం తీర్చిద్దుటకు తమ వంతుగా చంద్రబోస్ గారికి సన్మానం చేసి కవులు రచయితలు రచించిన పుస్తకాలను ఈ గ్రంధాలయం కి అందచేయడం జరిగింది అని అన్నారు. మారుమూల జయశంకర్ జిల్లా ను ప్రపంచ పటం లో నిలిపిన చంద్రబోస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ తెలంగాణ సామాజిక రచయితల సంఘము వారిని పుస్తకాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సామాజిక రచయితల సంఘం అధ్యక్షులు సంజీవ రావు, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మాసు రమేష్, మ్యాదరి సునీల్ తదితరులు పాల్గొన్నారు.