నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని రామాలయం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఇటీవల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతిపై చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లికి ప్రభుత్వ హై స్కూల్ వెళ్లిన సతీష్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్ ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ఏంఎంఓ సారయ్య,14వ వార్డ్ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్ ముఖ్య అతిధులుగా హాజరై శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా ఎనలేని సేవలు అందించారని భవిష్యత్తులో కూడా ఇలాంటి స్ఫూర్తితో పని చేయాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభ, ఉపాధ్యాయులు రవీందర్, వెంకటేశ్వర్లు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ క్యాతం తేజశ్రీ, స్థానిక అంగన్వాడీ టీచర్ నల్లభారతీ సుధాకర్ రెడ్డి , ఎండీ గౌసియా, ఆర్పి వేల్పుల రజిత, ఆయా సునీత,ఆశ కార్యకర్త రాజమణి,విజయ, లింగయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.