భూపాలపల్లి నేటిధాత్రి
వంద సంవత్సరాలుగా కాస్తు లో ఉన్న.. నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ.. రైతుల భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న నాయకులు
బినామి పట్టాలని రద్దుచేసి…. నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్….
యు వై ఎఫ్ ఐ… రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్
జయశంకర్ జిల్లా భూపాలపల్లి లోని పలివెల మండలం అక్రమంగా ఆక్రమించుకున్న భూములను సందర్శించడం జరిగింది పలిమెల బోడాయి గూడెం సర్వాయిపేట … గ్రామాల్లో ఉన్న రైతుల యొక్క భూమి అక్రమంగా డా క్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరట మూడు గ్రామాల రైతులు అక్రమంగా తెలవకుండా 110 ఎకరాలు భూమినిపట్టా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత 100 సంవత్సరాలుగా ఈ భూమిని కాస్తు చేసుకుంటూ మా తాతలు మా తండ్రులు మేము కాస్తు చేస్తున్నాం మా కుటుంబాలు ఈ భూమి మీదనే ఆధారపడి జీవిస్తున్నాం మాకు తెలవకుండానే 200 ఎకరాలు భూమి 110 ఎకరాల భూమిఅక్రమ దారుల పేరిట పట్టాయిందని తెలవగానే బిత్తర పోయాం 80 కిరణ భూమి స్లాట్ బుక్ అయిందా తెలిసింది2006 2008లో పట్టాలు చేస్తామని అప్పటినుండి నాయకులు అంటున్నారు తప్ప పట్టాలు చేసిన దాఖలు కనబడలేదు అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పాషా దొర పేరు మీద అక్రమంగా పట్టాలు చేసుకుని బినామీ పేరట నాయకులు సిమెంట్ ఫ్యాక్టరీకి అప్పనంగా కట్టబెట్టినారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తే మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలుగా వాళ్లు మమ్మల్ని మోసం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు కాస్తు లో ఉన్న మూడు గ్రామాల ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలకు తక్షణమే అక్రమ పట్టాలని రద్దుచేసి వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని టిఆర్ఎస్
టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు మోసం చేసిందని బిజెపి ఒక్కరి మీద ఒక్కరు ఆరోపణ చేసుకుంటూ చేతులు దులుపుకుంటున్నారు నిరుపేదల పట్ల ముసలి కన్నీరు కారుస్తావున్నారు తాసిల్దారు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం నిరుపేదల పట్ల ఆలోచన చేయకపోవడంలో అంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకివస్తున్నారు కానీ వాళ్ళ సమస్యల పట్ల స్పందించిన దాఖలు కానరావడం లేదు నిరుపేదల భూములు వాళ్లకే కట్టాలి ఇచ్చేంతవరకు వాళ్లందర్నీ సమీకరించి ఆందోళన పోరాటం నిర్వహిస్తాం అని తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి అక్రమ పట్టాలను రద్దుచేసి సాగులో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం… ఈ కార్యక్రమంలో దయ్యం పోశయ్య కిరణ్ కారు వెంకటేష్ కుమ్మరి శ్రీనివాసు మధునయ లచ్చయ్య సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు గంధం శంకర్ రాజు పాల్గొన్నారు