నర్సంపేట,నేటిధాత్రి:
ఈనెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగిన జిల్లా స్థాయి పలు క్రీడలలో పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ చెందిన12 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి క్రీడాకారులను అభినందించారు.అనంతరం క్రీడలు పలు జిల్లాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వరంగల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అలాగే రాష్ట్రస్థాయిలో బహుమతులు పొందాలని పేర్కొన్నారు. క్రీడల వలన మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆయన తెలిపారు.పోటీల్లో పాల్గొన్న
క్రీడాకారులు రెజ్లింగ్ క్రీడలో
గండ్రకోట వరుణ్,జూడో క్రీడలో ఎస్.కమల్,ఎస్.రాహుల్
ఎస్ .రిషికేష్,బి .కార్తీక్,బి.సిద్దు,సిహెచ్.కృతిక,జి.నక్షత్ర,సైక్లింగ్ క్రీడలో అడపా కౌశిక్,ఆట్య పాఠ్య క్రీడలలో,ఏ. సాయి కుమార్,సాయి కుమార్,అక్షయ్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బిక్షపతి,ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపాల్ మణికంఠ, ప్రిన్సిపల్ స్రవంతి,విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.