గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో బుద్ధారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్వాడ్ గర్భిణీలకు తల్లులకు సరైన పోషణ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అప్సర సుల్తానాఆధ్వర్యంలో అంగన్వాడీ బుద్ధారం మూడవ సెంటర్లో గురువారం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మహిళలకు వారి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని పోషకాలతో కూడిన ఆహార నియమావళిని అలవాటు పరుచుకోవాలో అవగాహన కల్పించడం జరిగింది .ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు పౌష్టిక ఆహారం పట్ జాగ్రత్తలు తీసుకోవాలనివాటి అంశాల పైన ఈ పోషణ పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని పోషణతో కూడిన ఆహారం తీసుకోవాలని చిరుధాన్యాలు తీసుకోవడం ముఖ్యమని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మూడవ సెంటర్ అంగన్వాడీ టీచర్ ఆలూరి కోమల మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గండ్ర పద్మ టీచర్ ఫస్ట్ సెంటర్, కళ్యాణి టీచర్ సెకండ్ సెంటర్ ఆయాలు అనిత ప్రమీల సమ్మక్క ఆశా వర్కర్లు జీ లత జి భార్గవి గర్భిణీలు అఖిల తల్లులు శ్రీమ నడిగోట్టు సుప్రియ పాల్గొన్నారు.