పనిచేయని నిఘా నేత్రాలు!

సీసీ కెమెరాలు ఉన్న ఫలితం సున్నా

పట్టించుకోని అధికారులు

వేములవాడ రూరల్ మండలం
చెక్కపల్లి గ్రామం మరియు రూరల్ మండల పలు గ్రామాలలో సైతం పనిచేయని సీసీ కెమరాలు
ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ప్రతీ క్షణాన్ని వీడియోలో నిక్షిప్తం చేసేలా ఏర్పాట్లుంటే దేన్నైయినా విశ్లేషించడం సులువు. ముఖ్యంగా నేర సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సమయాల్లో పోలీసు విచారణకు వీడియో రికార్డుల ఫుటేజీలు ఎంతో ఉపయోగపడుతాయి. అందుకే పోలీసు శాఖ, ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రోడ్ల వెంట, ప్రభుత్వం ప్రైవేట్‌ కార్యాలయాల్లో ఈ కాలంలో సీసీ కెమెరాలు, టీవీల వాడకం సాధారణం. ఇంత కీలకమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు కానీ వాటి నిర్వహణపై పట్టించుకునే నాథుడు లేరు వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో పోలీసు శాఖ ప్రోత్సహం తో మరియు గ్రామ పంచాయతీ నిధులతో దాతలు, ప్రజాప్రతినిధుల విరాళాలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మూలనపడ్డాయి. ముఖ్యంగా వాటి నిర్వహణను పంచాయతీ అధికారులు పట్టించుకోకే ఈ పరిస్థితి దాపురించింది.అని ప్రజలు వాపోతున్నారు చౌరస్తాలు, గ్రామ ముఖ ద్వారాలు, రద్దీ ప్రదేశాల్లో, రోడ్లపై విరివిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి నిర్వణను గాలికొదిలేయడంతో అందరి ప్రయత్నం, డబ్బు బూడిదలో పోసిన పన్నీరులా మారింది. నేరాల అదుపునకు సీసీ కెమెరాలను ఏర్పాటును అందరూ ప్రోత్సహించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామ నలుమూలల సీసీ కెమెరాలు, టీవీలను ఏర్పాటు చేయించినా నిర్వహణ లేక ఫలితం లేకుండా పోతోంది.

సీసీ కెమెరాలున్నాయి.. కానీ పనిచేయవు!

రూరల్ మండల పరిధి గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.మరి కొన్ని గ్రామాల్లో అసలు సీసీ కెమెరాలు హే లేవు కొన్ని రోజుల క్రితం వ్యవసాయ బావుల దగ్గర మోటార్ల దొంగతనం మరియు రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసిందే చివరికి రూరల్ పోలీసులు చకచక్యంగా మోటార్ల దొంగతనం చేదించిన విషయం తెలిసినదే ప్రతి గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటు ఉంటే నేర నియంత్రణ కొంతమేరకు అయినా తగ్గించవచ్చు అని పోలీసు శాఖ ఇటు ప్రజలు భావిస్తున్నారు
కాలం చెల్లిన సీసీ కెమెరాలను మార్చి కొత్తవి అమర్చాలి. అధికారులు, పోలీసులు పట్టించుకుంటేనే ఇవన్నీ సాధ్యం. సీసీ కెమెరాల ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం నెరవేరేదీ ఎప్పుడో వేచి చూడాలి?

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version