నామమాత్రంగా సర్వసభ్య సమావేశం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా కొనసాగింది. ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంపిపితో కలుపుకోని ఐదుగురు ఎంపీటీసీలు, కోఆప్షన్ రజబ్ అలీ హాజరైయ్యారు. ఈసమావేశంలో అధికారులు గ్రామాల్లో జరిగిన పలు అంశాలపై అభివృద్ధిపై పాఠాలు చదివి వినిపించారు. ప్రజా ప్రతినిధులు ఒకటి రెండు మినహా ఏసమస్యలపై కూడా స్పందించలేదు. ఈసమావేశానికి వైద్య, నీటిశాఖ, హార్టికల్చర్ అధికారులు గైర్హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!