బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

-రాజకీయంగా నా ఎదుగుదలకు సహకరించిన గండ్ర వెంకటరమణారెడ్డితోనే నిత్యం నా ప్రయాణం

-మొగుళ్ళపల్లి జడ్పిటిసి జోరుక సదయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, నా రాజకీయ ఎదుగుదలకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోనే నిత్యం నా ప్రయాణమని మొగుళ్ళపల్లి జడ్పిటిసి జోరుక సదయ్య అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొగుళ్ళపల్లి జడ్పిటిసి పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలోనే తన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎంపీపీ, సర్పంచ్, మరియు జడ్పిటిసిగా అవకాశం ఇచ్చి గెలిపించుకున్నారన్నారు. మొగుళ్లపల్లి మండలంలో గడచిన కాలంలో అనేక అభివృద్ధి, కార్యక్రమాలు గండ్ర వెంకటరమణారెడ్డి చేసినవే అని గుర్తు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో నాయకులు లేకపోయినప్పటికీ ప్రజలు, కార్యకర్తలే వారధిగా నిలిచి తమ గెలుపులో కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గండ్ర వెంకట రమణారెడ్డి ఓటమిపాలైనప్పటికీ గ్రామాల్లో కార్యకర్తలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నానన్నారు. అలాగే ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి, నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు టిఆర్ఎస్ పార్టీని వీడనన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version